పిజ్జా-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ హీరో విజయ్‌సేతుపతి నటిస్తున్న చిత్రం పురియత్ పుధీర్. ఈ చిత్రాన్ని పిజ్జా-2 పేరుతో డివి సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదలకానున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులు అమాయక మహిళలను ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో తెలిపే ఒక సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకుని థ్రిల్లర్ జోనర్‌లో రూపొందించబడింది. వరుసగా ఏడు హిట్లతో తమిళ సినీ రంగంలో ముందంజలో దూసుకుపోతున్న విజయ్ సేతుపతి ఈ చిత్రం ఎనిమిదవ హిట్‌గా నిలుస్తుంది. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన 48 గంటల్లోనే దాదాపు10 లక్షల మంది వీక్షించడం విజయ్‌సేతుపతి క్రేజ్‌కు నిదర్శనంగా నిలిచింది. అతి త్వరలోనే తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను విడుదల చేసి, ఇదే నెలలో తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆద్యంతం ఉత్కంఠతో నడుస్తూ ఆసక్తిని కలిగించే స్క్రీన్‌ప్లేతో సాగే ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ని దర్శకుడు రంజిత్ జయకోడి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు అని తెలిపారు. గాయత్రి నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నేరం ఫేమ్ రమేష్ తిలక్, సోనియా దీప్తి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:శామ్ సి.ఎస్., సినిమాటోగ్రఫి: దినేష్ కృష్ణన్, ఎడిటర్:్భవన శ్రీకుమార్, నిర్మాత:డి.వెంకటేష్, దర్శకత్వం:రంజిత్ జయకోడి.