నితిన్‌తో శృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేటెస్టుగా అ ఆ సినిమాతో కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్న హీరో నితిన్, ఆ సినిమా తరువాత మరో సినిమా కోసం చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటించేందుకు రెడీ అయ్యాడు. 14 రీల్స్ పతాకంపై రూపొందే ఈ సినిమా రొమాంటిక్ థ్రిల్లర్‌గా వుంటుందుని తెలిసింది. దాంతోపాటు భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ పాత్రకు అధిక ప్రాధాన్యత వుండడంతో ఈ పాత్ర కోసం గ్లామర్ భామ శ్రుతిహాసన్‌ని సంప్రదించారట. ప్రస్తుతం పవన్ సరసన ‘కాటమరాయుడు’, కమల్ ‘శభాష్ నాయుడు’, ‘సింగం-3’ చిత్రాల్లో నటిస్తున్న శ్రుతి ఈ సినిమాలో చేసేందుకు కూడా ఆసక్తిగానే వున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో ఓ సినిమాకు కమిటైన శ్రుతి, నితిన్ సరసన నటించేందుకు ఆసక్తి కనబరుస్తోందట. ముఖ్యంగా ఈ చిత్రంలో తను పాత్రకున్న ప్రాముఖ్యత దృష్ట్యా డేట్స్ అడ్జెస్ట్ చేసి సినిమాకు ఓకె చెప్పేలా వుందని సమాచారం.