పూరి-సునీల్.. డీల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, కమెడియన్ నుండి హీరోగా టర్న్ తీసుకున్న సునీల్‌ల పరిస్థితి ఒకేలా వుంది. కొన్ని రోజులుగా వీరు చేస్తున్న సినిమాలన్నీ పరాజయం పాలవ్వడంతో కాస్త టెన్షన్‌కు లోనవుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న పూరి తీసిన ‘ఇజం’ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. మరోవైపు సునీల్ కూడా రెండు పాత్రలు చేసి నటించిన ‘ఈడు గోల్డ్ ఎహే’ చిత్రం కూడా భారీ పరాజయాన్ని మూటకట్టుకోవడంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో వున్నారు. తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సునీల్ హీరోగా ఓ చిత్రం రూపొందించేందుకు డీల్ కుదిరిందని సినీ వర్గాల్లో వార్తలొస్తున్నాయి. ఆసక్తి కలిగించే ఈ కాంబినేషన్‌పై వస్తున్న వార్తలు అందరిలో క్రేజ్‌ని కలిగిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఖచ్చితంగా ఓ హిట్ సినిమా చేయాలనే కసితో వున్నారని, తప్పకుండా సునీల్‌కు హిట్ సినిమా ఇస్తానని పూరి మాటిచ్చాడని వార్తలొస్తున్నాయి. ఏదేమైనా హీరోలను తనదైన ఇమేజ్‌తో ఆకట్టుకునే పూరి ఈ సారి సునీల్‌తో ఎలాంటి సినిమా చేయిస్తాడో చూడాలి!