సందీప్ సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని సరసన కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది మెహరీన్. ఆ సినిమా తరువాత ఈమెకు చాలా అవకాశాలు వచ్చాయి. తాజాగా సందీప్‌కిషన్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం సందీప్‌కిషన్ కృష్ణవంశీ దర్శకత్వంలో ‘నక్షత్రం’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందే సినిమాకు సందీప్ కమిట్ అయ్యాడు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కే ఈ చిత్రంలో హీరోయిన్ మెహరీన్ కౌర్ ఎంపికైంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ చిత్రం డిసెంబర్‌లో సెట్స్‌పైకి వచ్చే అవకాశాలున్నాయి. మొత్తానికి వరుస సినిమాలతో లక్కీ ఛాన్స్ కొట్టేస్తోంది మెహరీన్.