థ్రిల్లర్‌గా బేతాళుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ ఆంటోనీ కథానాయకుడుగా ఫాతిమా విజయ్ ఆంటోనీ, మల్కాపురం శివకుమార్ సమర్పణలో మానస్ రుషి ఎంటర్‌ప్రైజెస్, విన్ విన్ విన్ క్రియేషన్స్, ఆరా సినిమాస్ పతాకంపై ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో కె.రోహిత్, ఎస్.వేణుగోపాల్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం బేతాళుడు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. బిగ్ సీడీని దర్శకుడు బోయపాటి శ్రీను విడుదల చేయగా, ఆడియో సీడీని కథానాయకుడు నిఖిల్ విడుదల చేసి తొలి కాపీని విజయ్ ఆంటోనీకి అందించారు. ఈ సందర్భంగా విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. తన సినిమాలకు తెలుగు ప్రేక్షకులనుండి ఇంత పెద్ద ఆదరణ వస్తుందని ఏనాడూ అనుకోలేదని, మూడో సినిమాకే తెలుగు మార్కెట్‌లో మంచి గుర్తింపు రావడం సంతోషం కలిగిస్తోందని, ఈ సినిమా విడుదల కోసం తాను కూడా ఎంతో ఉద్వేగంతో ఎదురుచూస్తున్నానని, కచ్చితంగా విజయవంతవౌతుందని ఆయన అన్నారు. ‘బిచ్చగాడు’ సినిమా తమిళంలో కంటే తెలుగులోనే పెద్ద విజయం సాధించిందని, విజయ్ ఆంటోనీ సాహసోపేతమైన నిర్ణయమే ఆయన్ను హీరోగా నిలబెట్టిందని నిర్మాత ఫాతిమా అన్నారు. తాను పది నిమిషాల టీజర్‌ను చూశానని, ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూడాలా అనుకుంటున్నానని, బేతాళుడు సక్సెస్‌తో విజయ్ ఆంటోనీ మరో మెట్టు ఎక్కుతారని నిర్మాత చదలవాడ శ్రీనివాస్ అన్నారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని, తొలి చిత్రమైనా తాను హీరో సహకారంతో అందరికీ నచ్చేలా రూపొందించానని దర్శకుడు ప్రదీప్ రామకృష్ణ అన్నారు. త్వరలో ఈ సినిమా విడుదల చేస్తామని తెలిపారు.