దీపికకు రెడ్‌కార్పెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ వేదికపై బాలీవుడ్ నటి దీపిక పదుకొనేకు అపూర్వ అవకాశం దక్కింది. గేట్ వే ఆఫ్ యూరోప్‌కా విఖ్యాతిగాంచిన నెదర్లాండ్స్‌లోని రొట్టెర్‌డామ్‌లో జరిగిన ఎంటివి యూరోపియన్ మ్యూజిక్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకల్లో రెడ్‌కార్పెట్‌పై హొయలొలికించేందుకు వచ్చిన దీపికకు అపూర్వ స్వాగతం లభించింది. ప్రఖ్యాత డిజైనర్ మొనీషా జైసింగ్ రూపొందించిన దుస్తుల్లో దీపిక ఆహూతులను ఆకట్టుకుంది. ‘ఎక్స్‌ఎక్స్‌ఎక్స్:ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’ చిత్రంతో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన దీపికకు తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి వేడుకలో అవకాశం వచ్చింది. భారత్ నుంచి ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో దూసుకుపోతూండగా ఇప్పుడు దీపిక తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కేవలం రెడ్‌కార్పెట్‌కే పరిమితం కాకుండా హాలీవుడ్ నటి నైనా దోర్బర్‌తో కలసి విజేతగా ఎంపికైన కెనడియన్ ఆర్టిస్ట్ ద వీండ్‌కు బహుమతిని ప్రదానం చేసింది. ‘మ్యూజిక్ ప్రపంచంలో పెనుసంచలనాలకు వేదికైన ఎంటివి కార్యక్రమాలను చూసి తను ఎదిగానని, ఇప్పుడు ఆ సంస్థ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని’ దీపిక వ్యాఖ్యానించింది.