శ్రీమంతుడికన్నా గొప్పగా కొత్త సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు-కొరటాల శివ కాంబినేషన్‌లో మరో ప్రతిష్ఠాత్మక చిత్రం ప్రారంభమైంది. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ సన్నివేశం బుధవారం ఉదయం రామానాయుడు స్టూడియోలో దేవుడి పటాలపై చిత్రీకరించారు. డి.వి.వి.దానయ్య రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ సన్నివేశంపై ఎం.శ్యాంప్రసాద్ రెడ్డి క్లాప్‌నివ్వగా, డి.సురేష్‌బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా కొరటాల శివ మాట్లాడుతూ- ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తామని, పవర్‌ఫుల్ కథనంతో రూపొందిస్తున్న ఈ చిత్రం తెలుగు సినిమా స్థాయిని పెంచేలా వుంటుందని అన్నారు. గతంలో మహేష్‌బాబు పోషించని ఓ వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నారని ఆయన అన్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నామని, శ్రీమంతుడికంటే ఈ సినిమా విజయవంతం అవుతుందని నిర్మాత డి.వి.వి.దానయ్య అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్, కెమెరా:రవి కె.చంద్రన్, నిర్మాత:డి.వి.వి.దానయ్య, దర్శకత్వం:కొరటాల శివ.