గోపీచంద్‌కు జోడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ హన్సిక ఈమధ్య తెలుగులో కంటే కూడా తమిళంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంటోంది. ముఖ్యంగా పలు తమిళ చిత్రాల్లో నటిస్తూ అక్కడే బిజీగా మారిపోయింది. దాంతోపాటు తెలుగులో కూడా స్టార్ హీరోయిన్‌గా వెలగాలనే ప్రయత్నాలు మాత్రం చేస్తూనే వుంది. తాజాగా ఈమె గోపీచంద్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. గోపీచంద్ ప్రస్తుతం ఆక్సిజన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన నటించే చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది హన్సిక. ‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ సినిమాలతో కమర్షియల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సంపత్ నంది దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం రేపటినుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లోనే హన్సిక జాయిన్ కానుంది. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ- గోపీచంద్‌తో కలిసి నటించడం ఆనందంగా వుందని, ఈ షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పింది. హన్సిక ప్రస్తుతం మంచు విష్ణు సరసన ‘లక్కున్నోడు’ చిత్రంలో కూడా నటిస్తోంది.