9న వినోదం ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్‌భరత్, అశ్విని, కాంచన ప్రధాన తారాగణంగా ఎస్.ఎస్. సెల్యులాయిడ్స్ పతాకంపై జై శ్రీరామ్ దర్శకత్వంలో పొట్నూరు శ్రీనివాసరావు రూపొందించిన హాస్య చిత్రం ‘వినోదం వంద%’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత పొట్నూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ మొదటినుండి చివరి వరకు వంద శాతం భారీ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బనవ్వించే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని రూపొందించామని, బ్యాంకాక్, థాయ్‌లాండ్‌లలో చేసిన షూటింగ్ హైలెట్‌గా ఉంటుందని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల 9న జరపనున్నామన్నారు. సంపు, పృథ్విల కామెడీ హైలెట్‌గా నిలిచే ఈ చిత్రాన్ని భారీగా తెరకెక్కించామని, ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోందని, దర్శకుడు జైశ్రీరామ్ తెలిపారు. సత్యం రాజేష్, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్‌రెడ్డి, తా.రమేష్, షకలక శంకర్, జీవ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, కెమెరా: రాజేష్, ఎడిటింగ్: నందమూరి హరి, నిర్మాత: పొట్నూరు శ్రీనివాసరావు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జైశ్రీరామ్.