అరుంధతి.. భాగమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అరుంధతి’, ‘రుద్రమదేవి’ సినిమాతో లేడీ ఓరియంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిపోయిన నటి అనుష్క ప్రస్తుతం చేస్తున్న మరో ‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం అక్టోబర్‌లో మొదలైంది. ఈ చిత్రంలో అనుష్క పాత్ర, నటన హైలెట్‌గా నిలుస్తాయని, కథ కూడా వైవిధ్యంగా కొత్తగా వుంటుందని మొదటినుండీ చిత్ర యూనిట్ చెబుతూ వస్తున్నారు. దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క సన్నిహిత వర్గాలనుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం అనుష్క నటిస్తున్న ‘బాహుబలి-2’ చిత్రం విడుదల తరువాత రిలీజవుతుందని తెలుస్తోంది. ఎందుకంటే ‘బాహుబలి’ తరువాత అనుష్క పాపులారిటీ మరింత పెరిగి సినిమాకి హెల్ప్ అయ్యే అవకాశముంది కనుక ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. యువి క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీకృష్ణ, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో పినిశెట్టి, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.