ఎన్టీఆర్, బన్నీలతో మల్టీస్టారర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ఈ వార్త మీడియా వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. రెండు భిన్న కోణాల హీరోలతో కలిపి మల్టీస్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట ఓ క్రేజీ దర్శకుడు. ఈ సినిమా కనుక సెట్స్‌పైకి వచ్చిందంటే నిజంగా సంచలనమనే చెప్పాలి. తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న నందమూరి ఫ్యామిలీ నుండి ఎన్టీఆర్, ఇక మెగా ఫ్యామిలీ నుండి అల్లు అర్జున్‌లతో ఈ సినిమా రూపొందించనున్నారట. ఈ ప్రయత్నానికి సన్నాహాలు చేస్తోంది పూరి జగన్నాధ్. ఇప్పటికే ఒక కథను ఎన్టీఆర్, బన్నీలకు వినిపించాడట. కథ విన్నవారు నచ్చిందని చెప్పడమే కాకుండా సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. నందమూరి హీరో, మెగా హీరో కాంబినేషన్‌లో వచ్చే సినిమా తీయాలంటే అది మామూలు విషయం కాదు. అందుకే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట పూరి జగన్నాధ్. దర్శకుడు పూరి జగన్నాధ్‌కు ఈమధ్య సరైన కమర్షియల్ విజయాలు దక్కడంలేదు. దాంతో ఈ సినిమా చేసి మళ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాకి కోన వెంకట్, బి.వి.ఎస్.రవి రచనా సహకారం అందిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే నిర్మాత తదితర వివరాలు ప్రకటిస్తాడట. మొత్తానికి ఈ సినిమా వచ్చిందంటే ఈ రెండు ఫ్యామిలీల అభిమానుల్లో ఎలాంటి సంచలనాలు రేకెత్తిస్తాయో చూడాలి! అన్నట్టు దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెలువడాల్సి వుంది.