హద్దుల్లేని ముద్దులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక సినిమాలో ఒక లిప్‌లాక్ సీన్ ఉండడం అనేది ఎంత క్రేజో అందరికి తెలుసు. ఆ సినిమాలో ఆ ముద్దు సన్నివేశం ఎప్పుడు వస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూసే ఆడియెన్స్ ఉంటారు. ఇక ఈమధ్య ప్రతి సినిమాలో ముఖ్యంగా బాలీవుడ్ చిత్రాల్లో ఈ ఘాటు లిప్‌లాక్‌లకు కొదవే లేకుండా పోయింది. జనరల్‌గా ఒక్క లిప్‌లాక్ ఉంటేనే అంత క్రేజ్ ఉంటే... ఈ సినిమాలో ఏకంగా 40 లిప్‌లాక్ సన్నివేశాలు ఉన్నాయట!! మరి ఆ సినిమాకు ఇంకెంత క్రేజ్ రావాలి చెప్పండి. ఒక లిప్‌లాక్ సీన్స్ ఉంటే సెన్సార్ ‘ఏ’ సర్ట్ఫికెట్ ఇచ్చేది, మరి ఇన్ని లిప్‌లాక్ సీన్స్ ఉంటే సెన్సార్ ఏమివ్వాలి? కానీ ఈ సినిమాకు సెన్సార్ యూ/ఏ ఇచ్చి షాక్ ఇచ్చింది. ఇంతకీ ఈ కథంతా ఏ సినిమా గురించో తెలుసా? బాలీవుడ్‌లో రణవీర్‌సింగ్, హాట్ భామ వాణికపూర్ కలిసి నటిస్తున్న ‘బేఫికర్’ సినిమా గురించి. ఆదిత్యచోప్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే మంచి క్రేజ్ క్రియేట్ చేసింది. పోస్టర్స్, ట్రైలర్‌లో లిప్‌లాక్‌లతో దుమ్మురేపారు. మరి సెన్సార్‌బోర్డు నుండి కూడా ఆమోదం పొందిన ఈ సినిమాలో హాట్ హాట్ సీన్స్ కూడా చాలానే ఉన్నాయట. డిసెంబర్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. టైటిల్ తగ్గట్టే.. బేఫికర్‌గా వాణి, రణవీర్‌ల రొమాన్స్ షాకిస్తుందని అంటున్నారు బాలీవుడ్ జనాలు.