మూడోసారి.. మున్నాభాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో వచ్చిన సంచలన సినిమాల్లో ‘మున్నాభాయ్’ ఒకటి. ఈ సినిమా మొదటి భాగం రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ‘మున్నాభాయ్ ఎంబిబిఎస్’, ‘లగేరహో మున్నాభాయ్’ సినిమాలతో దుమ్ములేపిన సంజయ్‌దత్.. ఇప్పుడు మూడో మున్నాభాయ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘మున్నాభాయ్ చలే అమెరికా’ అంటూ అప్పట్లోనే చిన్న టీజర్ కూడా వదిలారు. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో విధు వినోద్‌చోప్రా నిర్మించే ఈ మూడో సీక్వెల్ ఫైనల్ అయిందట. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ కూడా చివరి దశలో ఉందని, త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వస్తుందని అంటున్నారు. గత రెండు సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని అంటున్నాడు రాజు హిర్వాణి. ప్రస్తుతం సంజయ్‌దత్ తన బయోపిక్‌తో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తికాగానే మున్నాభాయ్ మూడో సిరీస్ మొదలుఅవుతుందట! మరి మున్నాభాయ్ అమెరికా వెళ్లి ఏంచేసాడో తెలియాలంటే ఇంకో ఏడాది దాకా ఆగాల్సిందే!!