ఎట్టా బతికేది.. ఎట్టా చచ్చేది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటుడుగా ఉన్నత శిఖరాలను అధిరోహించి, ‘జనసేనాని’గా ఎదుగుతున్న పవన్‌కళ్యాణ్ తాజాగా పెద్ద నోట్ల రద్దుపై స్పందించారు. పెద్దనోట్ల రద్దువల్ల సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అభిప్రాయపడిన పవన్‌కల్యాణ్ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేయాల్సిందని అన్నారు. కొత్తనోట్లు పూర్తిస్థాయిలో ఎప్పటికి అందుబాటులోకి వస్తాయో కేంద్రప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో పెద్దనోట్ల రద్దు, కొత్త నోట్లు అందుబాటులోకి రాకపోవడం వల్ల సాధారణ పౌరులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తన మిత్రుడు సాయిమాధవ్ రాసిన లేఖను తన అభిప్రాయలకు తోడుగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
‘మెతుకు మెతుకు కూడబెట్టి ముద్ద పోగేస్తే దొంగ కూడంటున్నారన్న.. నేనెట్టా బతికేది?’ అంటూ అసంతృప్తిని, ఆందోళనను వ్యక్తం చేశాడు. ‘కన్నీటి బొట్లు దాచిపెట్టి నేనుంటే నా ఏడుపు చెల్లదంటారు? ఎలా చచ్చేదీ’ అని ప్రశ్నించాడు. నే కరిగించిన కండను ఖర్చుపెట్టుకోవద్దంటే ఎలా? కష్టం విలువే రద్దయిందంటే కడుపులో దేవినట్టుగా ఉందని’ ఆ కవితలో ఆవేదనను తన బాధగా పవన్ వ్యక్తం చేశారు. భవిష్యత్ బాగుంటుంది అని అంటున్నారు. మరి ఆ భవిష్యత్‌లో నేనుండొద్దా? ఎంత బాగుందో నేను చూడద్దా? అని అడుగుతున్నారు. మరి అప్పటిదాకా నే బతకాలంటే ఎలా? అని ప్రశ్నించారు ఆ కవితలో. పది శాతం పందికొక్కులను పట్టుకోడానికి 90 శాతం బతుకులు ఎరలుగా మారాలా? అని ప్రశ్నించారు. ఈ ఎరలన్నీ తిరగబడి అగ్నిగోళాలైతే ఏం జరగనుంది? అని ప్రశ్నిస్తూ కవిత సాగింది. ఈ కవితపై టాలీవుడ్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. కాగా ఇటీవల పవన్‌కళ్యాణ్ జీసస్ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడి వృద్ధులకు నూతనోత్సాహాన్ని కలిగించిన ఫొటో కూడా సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.