రెగ్యులర్ షూటింగ్‌లో బోయపాటి చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే అందరికీ క్రేజ్. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’ సినిమాలు బాలయ్య మాస్ ఫాలోయింగ్‌ను ఓ రేంజ్‌కి తీసుకెళ్లిపోయారు. బాలకృష్ణ సినీ కెరీర్‌లో ఎప్పటికీ మర్చిపోలేని హిట్లుగా నిలిచాయి. బోయపాటి కూడా ఈ సినిమాలతో సీనియర్ స్టార్ హీరోల ఇమేజ్‌ను మోయగల అతికొద్దిమంది దర్శకుల్లో ఒకడిగా నిలబడిపోయాడు. బోయపాటి శ్రీను చివరగా అల్లు అర్జున్‌తో ‘సరైనోడు’ చిత్రం తీసి భారీ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ హిట్ తరువాత ఆయన తన తరువాతి చిత్రాన్ని హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో మొదలుపెట్టనున్నాడు. ఈమధ్యే పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రంయొక్క రెగ్యులర్ షూటింగ్ రేపే మొదలుకానుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఉండనున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు శరత్‌కుమార్ హీరో శ్రీనివాస్ తండ్రి పాత్ర పోషించనుండగా రకుల్‌ప్రీత్ హీరోయిన్‌గా నటించనుంది.