రాత్రిపూట షూటింగ్ కలిసొచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలో నా పాత్రకు సంబంధించిన షూటింగ్ దాదాపు 90 శాతం రాత్రి పూటే చేశారు. రాత్రి అవడంతో నా కళ్లు కూడా పాత్రకు బాగా సూటయ్యాయి. అందుకే చిత్రం చూస్తున్న ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నారని కథానాయిక నందితా శే్వత అంటోంది. నిఖిల్, హెబ్బాపటేల్, నందితాశే్వత ప్రధాన తారాగణంగా వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో మేఘనా ఆర్ట్స్ పతాకంపై రూపొందించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్ర కథానాయిక నందితాశే్వత పలు చిత్ర విశేషాలను తెలిపారు. ఆ విషయాలు, ఆమె మాటల్లోనే..
తొలి హిట్
తెలుగు చిత్రాలలో నేను నటించింది ఇదే మొదటిది. ఈ సినిమానే హిట్టయి తొలి హిట్‌ను అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను త్వరలో మరిన్ని తెలుగు చిత్రాల్లో నటించడానికి సిద్ధమవుతున్నాను.
ఇదే జోనర్
తమిళంలో కూడా ఇటీవల ఇదే జోనర్‌లో ఓ సినిమాలో నటించాను. తెలుగులో కూడా ఇదే జోనర్ అవడంతో ఈ సినిమాను చేయడానికి అంగీకరించాను. కంఫర్ట్‌గా ఉంటుందన్న ఒక్క ఆలోచన తప్ప మరేమీ లేదు.
క్లారిటీతో..
దర్శకుడు వి.ఐ.ఆనంద్ క్లారిటీతో సినిమాను రూపొందించారు. సెట్‌లో ప్రతి సన్నివేశాన్ని వివరించి చెప్పేవారు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ పోయాను. అంతే..
వైవిధ్యమైన కథ
ఈ చిత్రంలో కథ వైవిధ్యంగా ఉందన్న మాట నిజం. అందుకే ప్రేక్షకులనుండి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. షూటింగ్‌లో మేము పడ్డ కష్టానికి ఇప్పుడు ఫలితం లభిస్తోందని భావిస్తున్నాను. రొటీన్ సినిమాలకు భిన్నంగా దయ్యాన్ని చూపించారు. సాధారణగా హారర్ చిత్రాలలో దయ్యం అనేక కోణాలలో కనిపించింది అన్నట్లు చూపిస్తారు. కానీ ఈ చిత్రంలో సహజంగా చూపించడంతో ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నారు.
నిజంగానే నమ్ముతా
దయ్యాలు ఉన్నాయి అన్న మాటని నేను నమ్ముతాను. వ్యక్తిగతంగా దేవుడు ఎలా నమ్ముతామో దయ్యాన్ని కూడా అలానే నమ్మాలి. ఇది నా జీవితంలో జరిగిన ఓ సంఘటన. ఓ తెల్లవారుఝామున మా కుటుంబమంతా కారులో గుడికి వెళుతుంటే ఓ వింత ఆకారం చీకట్లో కనిపించింది. అది దయ్యమే. దయ్యాన్ని చూడడం అదే ఫస్ట్‌టైమ్.
నెక్ట్స్ సినిమాలు
ప్రస్తుతం తమిళ సినిమాల్లో బిజీగా ఉన్నాను. ఈ సినిమాకన్నా ముందే కొన్ని తెలుగు చిత్రాలలో అవకాశాలు వచ్చాయి. కానీ పాత్ర నచ్చకపోవడంతో చేయలేదు. ఇక నుండి మంచి పాత్రలు లభిస్తే తప్పక నటిస్తాను. త్వరలో ఏ విషయమూ చెబుతాను అంటూ ముగించారు.

- యు