ఆకట్టుకునే అందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేసింది రెండు మూడు సినిమాలు అయినాగానీ ప్రస్తుతం టాలీవుడ్‌లో కీర్తిసురేష్ గురించే మాట్లాడుకుంటున్నారు. పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు సరసన ఒకేసారి హీరోయిన్‌గా ఛాన్సులు కొట్టేయడంతో అందరి దృష్టీ కీర్తి సురేష్‌పై పడింది. పూర్తి బిజీలో వుంటూనే తన సినిమాలతో పరిశ్రమను ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా కీర్తి సురేష్ ‘నేను లోకల్’ అనే సినిమాకు సంబంధించిన షూటింగ్‌కు సంబంధించి హైదరాబాద్‌లో నటిస్తోంది. షూటింగ్ స్పాట్‌లో చూసిన ప్రతి ఒక్కరికీ కీర్తి సురేష్ ఆన్ స్క్రీన్‌కన్నా ఆఫ్ స్క్రీన్‌లోనే చాలా అందంగా కనిపించిందట. లొకేషన్‌లో ఆమె లుక్స్‌కు అందరూ ఫ్లాటైపోయారట. నిజంగా ఇంత అందంగా ఉండబట్టే ఒక్కసారిగా పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబుల చిత్రాల్లో అవకాశం సంపాదించింది అని వ్యాఖ్యానాలు వినిపించాయి. తెలుగులో కమర్షియల్ సినిమాల వైపు చూస్తూ, గ్లామర్‌ను ఎంత పండించాలో అంత మాత్రమే పండిస్తూ వరుస ఆఫర్లను చేజిక్కించుకుంటోంది ఈ భామ. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాల కనుక హిట్ అయ్యాయంటే నెంబర్ వన్ రేసులో వుంటుందన్నమాట నిజం.