డబ్బు సమస్యతో కోటీశ్వరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన్‌చంద్ర, పృథ్వీ నటించగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ రూపొందించిన చిత్రం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. శృతిసోధి, సలోని కథానాయికలుగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 23న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ- ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రాన్ని ఈనెలలోనే విడుదల చేయాల్సివుండగా అందరూ ఎదుర్కొంటున్న కరెన్సీ సమస్యను దృష్టిలో వుంచుకొని వచ్చే నెల 23న విడుదల చేయడానికి నిర్ణయించామని తెలిపారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయని, ఆడియో కూడా సూపర్‌హిట్ అయిందని ఆయన వివరించారు. జయప్రకాష్‌రెడ్డి, పోసాని, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్ శ్రీను, చలపతిరావు, ధన్‌రాజ్, గిరి, సన, పిల్లాప్రసాద్, విద్యుల్లేఖ రామన్, మీనా, నేహాంత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:శ్రీవసంత్, కెమెరా:బాల్‌రెడ్డి.పి., కథ, మాటలు:నాగేంద్ర కుమార్, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, నిర్మాత: కె.కె.రాధామోహన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఇ.సత్తిబాబు.