టీజర్‌లో మన్యం పులి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మలయాళంలో రూపొందిన పులి మురుగన్ చిత్రం కలెక్షన్లలో రికార్డు సృష్టించింది. ప్రముఖ నటుడు మోహన్‌లాల్ హీరోగా నటించిన ఈ చిత్రానికి వైశాఖ్ దర్శకత్వం వహించాడు. దీన్ని శ్రీ సరస్వతీ ఫిలింస్ పతాకంపై మన్యం పులి పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత కృష్ణారెడ్డి మాట్లాడుతూ- ‘చాలా గ్యాప్ తరువాత పులి మురుగన్ చిత్రాన్ని నిర్మాతగా మన్యం పులి పేరుతో విడుదల చేస్తున్నాం. సిందూరపువ్వు, సాహసఘట్టం సినిమాలకంటే ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది. మలయాళంలో 125 కోట్ల గ్రాస్ సాధించి సంచలనం క్రియేట్ చేసింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి డిసెంబర్ మొదటివారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం ’అన్నారు. హెబాపటేల్ మాట్లాడుతూ-‘టీజర్ బాగా నచ్చింది. తప్పకుండా అందరికీ నచ్చి సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’ అన్నారు. నాగ అనే్వష్ మాట్లాడుతూ-మలయాళంలో బాహుబలి సినిమాలా గుర్తింపు తెచ్చుకున్న మన్యం పులి చిత్రం తెలుగులో కూడా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు. జగపతిబాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంగీతం:గోపీకృష్ణ, కెమెరా:సాజీకుమార్, ఎడిటింగ్:జాన్ కుట్టి, షిజాస్ పియూనస్, నిర్మాత:సింధూరపువ్వు కృష్ణారెడ్డి, దర్శకత్వం:వైశాఖ్.