చంద్రముఖి తరహాలో శివలింగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాఘవేంద్ర లారెన్స్, రితికా సింగ్ జంటగా ప్రముఖ దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి.పిళ్లై నిర్మిస్తున్న చిత్రం ‘శివలింగా’. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పాత్రికేయుల సమావేశం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు పి.వాసు మాట్లాడుతూ- ‘పదేళ్ల క్రితం కన్నడంలో ఆప్తమిత్ర సినిమా తీశాను. అది పెద్ద హిట్ కావడంతో దానే్న చంద్రముఖి పేరుతో రీమేక్ చేశాను. రజనీకాంత్ నటించిన ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఇటీవలే కన్నడంలో నేను చేసిన శివలింగా చిత్రం ఘనవిజయం సాధించడంతో దాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నా. లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మా అబ్బాయి శక్తివాసు కీలక పాత్ర పోషిస్తున్నాడు. తమిళంలో రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. కాంచన, కాంచన-2 సినిమాలకు లారెన్స్ ఎంత రిస్క్ తీసుకుని నటించాడో, అంతకంటే ఎక్కువ రిస్క్ తీసుకుని ఈ సినిమా చేశాడు. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఆడియో విడుదల చేస్తాం’ అన్నారు. నిర్మాత రమేష్ మాట్లాడుతూ- వాసు, లారెన్స్‌ల కాంబినేషన్‌లో ఈ చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా వుందన్నారు. లారెన్స్ మాట్లాడుతూ- ‘కాంచన పెద్ద హిట్ అయింది. గంగ ఇంకా పెద్ద హిట్. ఆ సినిమాలను మించిన సినిమా చేయాలని ఎదురుచూస్తున్న సయంలో వాసు కన్నడంలో వచ్చిన శివలింగ చిత్రాన్ని చూడమన్నారు. చూడగానే నచ్చింది. ఈ సినిమాకు కథే హీరో. ఆ తరువాత రితికాసింగ్ రెండో హీరో చంద్రముఖి సినిమాలో జ్యోతికకు ఎంత పేరొచ్చిందో ఈ సినిమాలో రితికకు అంత మంచి పేరు వస్తుంది. దర్శకుడు వాసుతో సినిమా చేయడం ఆనందంగా వుంది’ అన్నారు. రితికాసింగ్ మాట్లాడుతూ-వాసు, లారెన్స్‌ల కాంబినేషన్‌లో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రానికి కెమెరా:సర్వేష్ మురారి, సంగీతం:తమన్, ఎడిటింగ్:సురేష్ అర్స్, నిర్మాత:రమేష్ పి.పళ్లై, దర్శకత్వం పి.వాసు.