సంక్రాంతికి ఖైదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు చిరంజీవి, కాజల్ జంటగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఖైదీ నెం.150. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే యూరప్‌లో రెండు పాటల చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- ‘ఇటీవలే పాటల చిత్రీకరణ కోసం యూరప్ వెళ్లాం. అక్కడ క్రొయేషియా, స్లోవేనియా వంటి అద్భుతమైన లొకేషన్లలో పాటలను చిత్రీకరించాం. శేఖర్, జానీ మాస్టర్‌ల నేతృత్వంలో రూపొందిన ఈ పాటల్లో చిరంజీవి స్టెప్పులు అదిరేలా వుంటాయి. మిగిలిన షూటింగ్ పార్ట్ త్వరలోనే పూర్తిచేస్తాం. త్వరలోనే మిగతా కార్యక్రమాలన్ని పూర్తిచేసి సంక్రాంతి కానుకగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా మెగా ఫ్యాన్స్‌కు పెద్దపండగే.