డ్రగ్స్ మాఫియాపై మండే సూర్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ, తెలుగు భాషల్లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్య, హన్సిక జంటగా మగిల్ తిరుమేని దర్శకత్వంలో తమిళంలో రూపొందిన మీగమాన్ చిత్రాన్ని సర్వల ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ సూర్య సాకేత్ పిక్చర్స్ పతాకాలపై మండే సూర్యుడు పేరుతో విడుదల చేస్తున్నారు. బెల్లంకొండ వెంకటేశ్వర్లు, కొలన ఎల్లారెడ్డి, సర్వల గణేష్ యాదవ్ నిర్మాతలు. ఈ చిత్రం తెలుగు అనువాద కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా చిత్ర వివరాలను గురించి నిర్మాతలు తెలియజేస్తూ-‘డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఆర్య అండర్ కవర్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. గ్లామర్‌తో ఆకట్టుకోవడమే కాదు, హన్సిక కెరీర్‌లో ఇదో భిన్నమైన పాత్ర. ఇండియన్ డ్రగ్ మాఫియా నెట్‌వర్క్ ఎలా వుంటుంది? వారి ప్లాన్లు ఎలా వుంటాయి అనే విషయాలపై రీసెర్చి చేసి దర్శకుడు మగిల్ తిరుమేని అద్భుతంగా తెరకెక్కించాడు. ఆర్య, ఏడుగురు విలన్ల మధ్య సాగే ట్రాక్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. త్వరలోనే మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:తమన్, మాటలు:వెంకట్ మల్లూరి, నిర్మాణ నిర్వహణ:శ్రీనివాస్‌రెడ్డి, దర్శకత్వం:మగిల్ తిరుమేని.