సలలిత రాగ సుధారస సారం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వౌనమే నీ భాష ఓ మూగమనసా..’ ఇప్పటికీ ఈ పాట వింటే ఎవరి మనసైనా భావోద్వేగాలతో నిండిపోతుంది. మదిని హాయి గొలుపుతూ తనదైన గాత్రంతో ఆకట్టుకోవడంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణది ప్రత్యేక శైలి. కర్నాటక సంగీతాన్ని తనదైన గాత్రంతో సామాన్యుడికి సైతం దగ్గర చేసింది మురళీ గానమే. సంగీతాన్ని ఔపోసన పట్టిన మహా వాగ్గేయకారుడు, కర్నాటక సంగీతానికి ఖండాంతరాల ఖ్యాతితెచ్చిన తెలుగుతేజం మంగళంపల్లి. ఆ గొంతు మూగబోయిందని తెలిశాక తెలుగు చలనచిత్ర సీమ దిగ్భ్రాంతి చెందింది. బాలమురళి ఆలపించిన ఆణిముత్యాల్లాంటి పాటల్లో ‘ఉయ్యాల జంపాల’ చిత్రంలోని ‘ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు..’ పాటతోపాటు ‘నర్తనశాల’లో ‘సలలిత రాగ సుధారస సారం’ గీతం ఉన్నాయ. ‘శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు’ సినిమాలో ‘వసంత గాలికి వలపులు రేగ’, ‘కర్ణ’ చిత్రంలో ‘నీవూ నేనూ వలచితిమి’ , ‘గుప్పెడు మనసు’లో ‘వౌనమే నీ భాష ఓ మూగ మనసా!’ వంటి పాటలు జనం గుండెల్లో ఇప్పటికీ పదిలం. ‘్భక్తప్రహ్లాద’ చిత్రంలో పాడిన అన్ని గీతాలూ తృప్తినిచ్చాయని బాలమురళి చెబుతుండేవారు . ‘పలుకే బంగారమాయేనా.. అందాల రామా’ వంటి పాటలు కూడా సినీ సంగీతాభిమానులను అలరించాయ. ఇక నటన విషయానికొస్తే- ‘సంధ్య గిదేన సింధూరం’ అనే మలయాళ చిత్రంలో కథానాయకుడిగా, ‘్భక్తప్రహ్లాద’లో నారదుడిగా ఆయన నటించిన పాత్రలు చాలా మంచివి. ‘సంధ్యారాగ’ కన్నడ సినిమాకి 1974లో ఉత్తమ సంగీత దర్శకుడిగా ప్రాంతీయ బహుమతి లభించింది. సినిమా గాయకుడిగా ‘హంసగీతే’ కన్నడ చిత్రానికి 1975లోనూ, ‘మధ్వాచార్య’ చిత్రానికి 1986లో సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు, ఫిలిమ్ ఫేర్ సత్కారాలు పొందారు.
‘ఆదిశంకరాచార్య (1983), రామానుజాచార్య (1989) చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. సినిమా అనగానే తమిళ ప్రేక్షకులకి ‘తిరువివైయాడల్’ చిత్రంలోని ‘ఒరునాల్ పోదుమా’ పాట గుర్తుకొస్తుంది. ‘తలలై వనుక్కోరుతలైవి’ అనే పాటకు సంగీత దర్శకత్వం వహించారు. బాలమురళి నటించిన ‘నవరత్నం’ చిత్రానికి కర్ణాటక, హిందుస్తానీ, పాశ్చాత్య బాణీలతోపాటు జానపద వరస అవసరమైంది.