నాని కొత్త చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని కథానాయకుడిగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎల్‌ఎల్‌పి పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య రూపొందిస్తున్న కొత్త చిత్రం హైదరాబాద్ ఫిలింనగర్‌లో బుధవారం ప్రారంభమైంది. నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టిలపై తొలి సన్నివేశంపై క్లాప్‌ను దర్శకుడు వి.వి. వినాయక్ ఇచ్చారు. మరో దర్శకుడు కొరటాల శివ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ- వైవిధ్యమైన కథనంతో ఈ సినిమా సాగుతుందని, కోన వెంకట్, కార్తిక్ ఘట్టమనేని, గోపీసుందర్, నివేదా థామస్ లాంటి మంచి టెక్నీషియన్‌లతో పనిచేయడం గర్వంగా వుందని, ఆది పినిశెట్టితో నటించడం మంచి కలయికగా నిలుస్తుందని తెలిపారు. 80 శాతం షూటింగ్ అమెరికాలోనే జరుగుతుందని, మిగిలినది హైదరాబాద్, వైజాగ్‌లో చేస్తామని నిర్మాత డి.వి.వి.దానయ్య తెలిపారు. రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల 5నుండి జరుగుతుందన్నారు. ఇది తన కెరీర్‌కు ప్లస్ అయ్యే సినిమా అవుతుందని ఆది పినిశెట్టి తెలిపారు. ఓ వండర్‌ఫుల్ కథతో నటిస్తున్నానని నటి నివేదా థామస్ తెలిపారు. కోన వెంకట్ స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా వుంటుందని దర్శకుడు శివ నిర్వాణ తెలిపారు. రవిరాజా పినిశెట్టి, శిరీష్, దామోదర ప్రసాద్, యలమంచిలి రవిశంకర్, బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. మురళీశర్మ, తనికెళ్ల భరణి, పృధ్వీ, రాజశ్రీనాయర్, నీతూ, భూపాల్‌రెడ్డి, కేదార్ శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:గోపీసుందర్, కెమెరా:కార్తిక్ ఘట్టమనేని, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, శ్రీజో, నిర్మాత:డి.వి.వి.దానయ్య, దర్శకత్వం:శివ నిర్వాణ.