అలాంటిదేం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్దకాలంగా తెలుగు, తమిళ భాషల్లో గ్లామర్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ శ్రీయ. ఇప్పటికీ తరగని అందంతో ఆకట్టుకుంటున్న ఈమెకు ఈమధ్య సినిమాలు తగ్గాయి. గ్లామర్ హీరోయిన్‌గా చాలామంది స్టార్ హీరోలతో నటించి సంచలనం రేపిన శ్రీయ, ప్రస్తుతం బాలకృష్ణ సరసన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే హిందీలో దృశ్యం సినిమాలో చేసిన ఈమె, గత కొన్ని రోజులుగా టాలీవుడ్ హీరో రానాతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు సినిమా కార్యక్రమాలు, ఫ్యాషన్ షోలు, ఈవెంట్లు అంటూ ఇద్దరూ కలిసి తిరుగుతున్నారు. చాలాసార్లు బాలీవుడ్‌లో కూడా వీరి వ్యవహారంపై మీడియా వర్గాల్లో సందేహాలు నెలకొన్నాయి. ఇంతకుముందు రానా త్రిషతో కొన్ని రోజులు ప్రేమాయణం నడిపించినట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీయతో రానా ప్రేమలో వున్నట్టు తాజా సమాచారం. ఈ విషయంపై స్పందించిన శ్రీయ, ఇద్దరం కలిసి తిరిగినంత మాత్రాన ఏదో వుందని అనుకుంటే ఎలా? అని రీకౌంటర్ వేస్తోంది. పైగా నాకు బెస్ట్ ఫ్రెండ్ రానా అని కాంప్లిమెంట్ ఇస్తోంది. మొత్తానికి శ్రీయ వ్యవహారంపై అటు కోలీవుడ్‌లో కూడా ఇలాంటి ప్రశ్నలే సంధిస్తున్నాయి సినీ వర్గాలు.