డబ్బుకోసం సత్యా గ్యాంగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్యూష్ వి.ఆర్., హర్షిత పన్వర్ జంటగా సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో ఎం.మహేష్ కన్నా రూపొందిస్తున్న సత్యాగ్యాంగ్ చిత్రం గురువారం ఉదయం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. కాశీవిశ్వనాధ్ కెమెరా స్విచ్చాన్ చేయగా పద్మా దేవేందర్ రెడ్డి తొలి క్లాప్‌నిచ్చారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత ఎం.మహేష్ కన్నా మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులకు ఇది నచ్చుతుందని తెలిపారు. ఈ చిత్రంలో తాను సత్య పాత్రలో నటిస్తున్నానని కథానాయకుడు ప్రత్యూష్ అన్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించే ఈ చిత్రంలో నలుగురు కుర్రాళ్లు హైదరాబాద్‌కు వచ్చి బతకడానికి ఏ మార్గం ఎంచుకున్నారు? డబ్బుకోసం ఎలాంటి దారిలో నడిచారు? అనే కథనంతో ఈ చిత్రం సాగుతుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దుతున్నామని దర్శకుడు ప్రభాస్ నిమ్మల అన్నారు. అప్పారావు, గబ్బర్‌సింగ్ రాజశేఖర్, అంజిబాబు, ప్రేమ్, మహేష్‌కన్నా, సతీష్, రామ్, బాబూరావు తదితరులు నటిస్తున్నారు.