సింగం-3 సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్య కథనాయకుడిగా తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్న చిత్రం సింగం-3 స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా హరి దర్శకత్వంలో రూపొందిస్తుండగా, సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో అందిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ, టీజర్‌కు మంచి స్పందన లభిస్తోందని, కబాలి చిత్రం తరువాత ఎక్కువ వ్యూలు ఈ చిత్రానికి లభించాయని తెలిపారు. సూర్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన పాటలను డిసెంబర్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ చిత్రం సూర్య నట విశ్వరూపాన్ని ఆవిష్కరిస్తుందని తెలిపారు. ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో రూపొందించిన ఈ చిత్రంలో నీతి నిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి విధి నిర్వహణలో సవాళ్లను ఏ విధంగా ఎదుర్కొన్నాడన్న కథనంతో సాగుతుందని తెలిపారు. రాధికా శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:హారిస్ జయరాజ్, నిర్మాత:మల్కాపురం శివకుమార్, దర్శకత్వం:హరి.