లవ్ యు ఆలియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందన్‌కుమార్, సంగీత చౌహాన్ జంటగా సమీస్ మ్యాజిక్ సినిమా పతాకంపై ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ‘లవ్ యు ఆలియా’. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల సందర్భంగా దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ మాట్లాడుతూ,-‘అందర్నీ ఆకట్టుకునే చక్కని ప్రేమ కథా చిత్రమిది. యువజంట చందన్‌కుమార్, సంగీత చౌహాన్‌లతోపాటు ప్రముఖ నటి భూమిక, సుదీప్, సన్నీలియోన్ ప్రత్యేక పాత్రలు పోషించారు.
తెలుగులో ఎన్నో హిట్ సాంగ్స్‌ని పాడిన జెస్సీ గిఫ్ట్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రానికి పాటలు ప్లస్ పాయింట్ అవుతాయి’ అన్నారు. భూమిక, సుదీప్, సన్నిలియోన్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో చందన్‌కుమార్, సంగీత చౌహాన్, నికిషా పటేల్, రవిచంద్రన్, రవిశంకర్, షాయాజీ షిండే తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:జెస్సీ గిఫ్ట్, సినిమాటోగ్రఫి:సంతోష్‌రాయ్ పతాజే, ఎడిటింగ్:సురేష్ డి.హెచ్., నిర్మాణం:సమీస్ మ్యాజిక్ సినిమా. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఇంద్రజిత్ లంకేష్.