ప్రేమవరకు ఈ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవా, కాజల్ జంటగా డి.కె. దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘కావలైవేండామ్’ చిత్రాన్ని తెలుగులో డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ ‘ఎంతవరకు ఈప్రేమ’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం తమిళంలో నిన్న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా నిర్మాత వెంకటేష్ మాట్లాడుతూ- ‘యువతరం మెచ్చే అద్భుతమైన ప్రేమకథా చిత్రమిది. నిన్న విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆకాశానికి ఎత్తేశారు. ముఖ్యంగా లవ్ ఎంటర్‌టైనరంటూ రేటింగ్‌లు కూడా బాగా వచ్చాయి. ఈ సినిమా ఘనవిజయం సాధించినందుకు ఆనందంగా వుంది. తెలుగులో కూడా ఏకకాలంలో విడుదల చేద్దామనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. త్వరలోనే విడుదల చేస్తాం. ఈ చిత్రంలో కాజల్ గ్లామర్ హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దాంతోపాటు కెమెరా పనితనం, రీరికార్డింగ్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. జీవా-కాజల్‌ల రొమాన్స్ బాగుందంటూ ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం రెట్టింపు అయింది’ అన్నారు.