రెండోగదిలో నాగార్జున

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘ఓం నమో వేంకటేశాయ’ ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తిచేసుకున్న వచ్చే ఏడాదిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత హారర్ నేపథ్యంలో రూపొందే చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. బుల్లితెర యాంకర్‌గా పాపులర్ అయిన ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన ‘రాజుగారి గది’ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాజుగారి గది-2 పేరుతో రూపొందే సినిమాలో నాగార్జున నటిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ పూర్తయిన ఈ చిత్రం ఆదివారం ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి. పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన కథ చెప్పగానే నాగార్జున వెంటనే ఓకె చెప్పారట. ఇప్పటివరకూ పలు భిన్నమైన సినిమాలు చేసిన నాగార్జునకు ఇది కొత్త జోనర్ అని చెప్పాలి. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.