హాలీవుడ్ స్టంట్స్‌తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి సంచలన విజయం తరువాత బాహుబలి-2 చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా కోసం తను మూడేళ్ల సినీ జీవితాన్ని త్యాగం చేసిన ప్రభాస్ బాహుబలి తరువాత తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. ప్రభాస్ తరువాతి సినిమా రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో రూపొందనుంది. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్‌తోపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి తరువాత వచ్చే సినిమా కాబట్టి ఆ స్థాయిలో వుండేలా భారీ బడ్జెట్‌తో, భారీ సాంకేతిక నైపుణ్యంతో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్షన్ మాస్టర్స్ నేతృత్వంలో స్టంట్స్ వుంటాయని, యాక్షన్ ఎపిసోడ్‌లన్నీ దుబాయ్, గల్ఫ్ దేశాల్లో జరుగుతాయని తెలిసింది. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం ప్రారంభం కానున్నదట. యు.వి క్రియేషన్స్ పతాకంపై నిర్మించే ఈ సినిమాలో హీరోయిన్ ఇతర టెక్నీషియన్ల వివరాలు త్వరలోనే వెల్లడిస్తారట.