మెట్రోలో గీతామాధురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో క్రేజీ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న గీతామాధురి త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. హస్కీ వాయిస్‌తో ఆకట్టుకుంటున్న ఈమె, హీరోయిన్‌గా చేస్తే సంచలనమే అంటూ అంతటా ఆసక్తి నెలకొంది. గీతామాధురి నటించే సినిమా ఏంటి? అనే ప్రశ్న అందరిలో మెదిలింది. దానికి జవాబుగా మెట్రో సినిమాలో ఓ పాటలో గీతామాధురి నటించింది. చైన్‌స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలోని ఓ పాటలో తనని తాను ఆవిష్కరించుకుందట. ఎంతో శ్రావ్యంగా సాగే ఈ పాటలో మెలోడీ ఆలపించడమే కాకుండా తనదైన శైలిలో అభినయించారు. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న మెట్రో సినిమాలో గీతామాధురి పాడిన పాట హైలైట్‌గా నిలుస్తుంది. ఆమె పాడడమే కాకుండా అభినయించారు. ఆమెకు సంబంధించిన ఫొటోలు విడుదల చేశాం. ప్రేక్షకులకు థ్రిల్ కలిగించేలా వుంటుంది అన్నారు. మరి ఈ సాంగ్‌తో క్రేజీ దక్కితే భవిష్యత్తులో మరిన్ని పాటల్లో కనిపిస్తుందేమో గీత!