మరో కాంచన ‘శివలింగ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాఘవ లారెన్స్, రుతికా సింగ్ జంటగా అభిషేక్ ఫిలిం పతాకంపై పి.వాసు దర్శకత్వంలో రమేష్ పిళ్లై రూపొందిస్తున్న చిత్రం ‘శివలింగ’. షూటింగ్ అంతా పూర్తయిన సందర్భంగా దర్శకుడు వాసు మాట్లాడుతూ- చంద్రముఖి, ఆప్తమిత్ర స్టైల్లో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, శక్తివాసు ఓ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తామన్నారు. రాఘవేంద్ర లారెన్స్‌కు కాంచన, కాంచన-2 సినిమాలతో ఎంత పేరుతెచ్చిందో అంత పేరు ఈ సినిమాతో వస్తుందని, ఓ పాట మినహా షూటింగ్ మినహా పూర్తిచేశామన్నారు. డిసెంబర్ మొదటివారంలో ఆడియో విడుదల చేయనున్నామని, జనవరిలో సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. గంగకన్నా పెద్ద హిట్ చిత్రం చేయాలని ఎదురుచూస్తున్న తనకు శివలింగలో పాత్ర నచ్చిందని, వెంటనే ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చానని, కథే సినిమాలో హీరోగా వుంటుందని రాఘవ లారెన్స్ తెలిపారు. కథానాయిక రితికా సింగ్ ఇంటర్‌వెల్ బ్యాంగ్‌లో చేసిన యాక్షన్ ప్రేక్షకులకు గగుర్పాటు కలిగిస్తుందని, సినిమా తప్పక విజయవంతం అవుతుందని తెలిపారు. వడివేలు, రాధారవి, జయప్రకాష్, ప్రదీప్ రావత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:సర్వేష్ మురారి, సంగీతం:ఎస్.ఎస్.తమన్, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, ఎడిటింగ్:సురేష్, నిర్మాత:రమేష్ పి పిళ్ళై, దర్శకత్వం:పి.వాసు.