2న అరకురోడ్డులో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై వాసుదేవ్ దర్శకత్వంలో రామ్‌శంకర్, నికిషా పటేల్ జంటగా మేకా బాలసుబ్రహ్మ ణ్యం, బి.్భస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘అరకురోడ్డులో’. ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం ఉదయం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ, ఈ సినిమాను ఇప్పటికే సెలబ్రిటీలకు ప్రదర్శించామని, సినిమా విజయంపై నమ్మకం పెరిగిందని తెలిపారు. ప్రభాస్ విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన వస్తోందని, పృథ్వీ చేసిన పాత్ర సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనుందని వారు తెలిపారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో సినిమాలకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గినప్పటికీ, సినిమాపై వున్న నమ్మకంతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు వివరించారు. కార్యక్రమంలో రామ్‌శంకర్, నికిషాపటేల్, విజయ్ నక్కా, జగదీష్ చీకటి తదితరులు పాల్గొని విశేషాలను తెలిపారు. కమల్ కామరాజు, అభిమన్యుసింగ్, కోవైసరళ, పృధ్వీ, కృష్ణ్భగవాన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:రాహుల్‌రాజ్, రచన, దర్శకత్వం: వాసుదేవ్.