నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్కీ మీడియా పతాకంపై హెబ్బాపటేల్, రావురమేష్, తేజస్వి మడివాడ, అశ్విన్‌బాబు, పార్వతీశం, నోయల్‌సేన్ ప్రధాన తారాగణంగా బండి భాస్కర్ దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ రూపొందించిన చిత్రం ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్’. నిర్మాత మాట్లాడుతూ,‘అమ్మాయికి తండ్రంటే ప్రాణం. తండ్రికి కూతురు అంటే ఆరోప్రాణం. పుట్టినప్పటి నుంచి కాలు కందకుండా పెంచితే, ఆ అమ్మాయికి ఈడువచ్చాక బాయ్‌ఫ్రెండ్స్ పేరిట ఆమె జీవితంలోకి ముగ్గురు వస్తారు. ఇంతకీ ఎవరాముగ్గురు? ఆ ముగ్గురి పట్ల ఆమె తండ్రికి ఉన్న అభిప్రాయం ఏమిటి? అంతరార్థం ఏమిటి? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం తెరకెక్కించామ’ని తెలిపారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చిందని, పాటలన్నీ బాగా ఉన్నాయని అన్నారు. కృష్ణ్భగవాన్, సన, తోటపల్లి మధు, ధన్‌రాజ్, షకలక శంకర్, చమ్మక్ చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: శేఖర్‌చంద్ర, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, స్క్రీన్‌ప్లే, మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ, కథ: బి.సాయికృష్ణ, పాటలు: చంద్రబోస్, భాస్కరభట్ల, వరికుప్పల యాదగిరి, కాసర్లశ్యామ్, నిర్మాత: బెక్కం వేణుగోపాల్, దర్శకత్వం: బండి భాస్కర్.