అందరికీ నచ్చే శేఖరంగారి అబ్బాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విన్ను మద్దిపాటి, అక్షత జంటగా అఛీవర్ సిగ్నేచర్ ఎం.ఎఫ్.క్రియేషన్స్ పతాకంపై అక్షత దర్శకత్వంలో మద్దిపాటి సోమశేఖరరావు, మధుఫోమ్రా రూపొందించిన చిత్రం శేఖరం గారి అబ్బాయి. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ- కొత్త నటులు విన్ను మద్దిపాటి ఈ చిత్రంలో కథానాయకుడుగా తెరంగేట్రం చేస్తున్నాడని, కథానాయిక అక్షత దర్శకురాలిగా వ్యవహరించడం ఓ విశేషం అని తెలిపారు. సరైన ప్లానింగ్‌తో బడ్జెట్ కథకు తగిన విధంగా సమకూర్చుని అందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించామని వారు తెలిపారు. సినిమా వైవిధ్యమైన కథనంతో తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా రూపొందిందని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు. చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌కు మంచి ఆదరణ లభించిందని, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం వుందని వారు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:సాయి యెలేందర్, కెమెరా:రాఘవ, ఎడిటింగ్:నందమూరి హరి, నిర్మాతలు:మద్దిపాటి సోమశేఖరరావు, మధుఫోమ్రా, దర్శకత్వం:అక్షత.