ఫిబ్రవరిలో నమో వేంకటేశాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున హథీరామ్‌బాబాగా నటిస్తున్న చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం తరువాత ప్రిస్టేజియస్ మూవీగా రూపుదిద్దుకుంటోంది. ఆధ్యాత్మిక చింతనతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో అనుష్క ఓ కీలకమైన పాత్రలో నటిస్తుండగా, ప్రగ్యా జైస్వాల్, విమల ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కులు 12 కోట్లకు అమ్ముడుపోవడంతో సినిమాపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరి 9న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.