పూరీ చేతిలో మూడు కోతులు.. ఒక మేక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరి జగన్నాథ్ ‘ఇజం’ తరువాత తన నెక్స్ట్ సినిమాను ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే కన్నడంలో ‘రోగ్’ చిత్రాన్ని చేసిన పూరి ఆ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేస్తారట. ఇక లేటెస్ట్‌గా పూరి జగన్నాథ్ ఓ కొత్త టైటిల్‌తో సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ టైటిల్ ఏమిటో తెలుసా? ‘మూడు కోతులు... ఒక మేక’! ఏంటి టైటిల్ వినగానే షాక్ అయ్యారా? నిజమండి బాబు.. ఇదే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నాడు పూరి. అయితే ఈ సినిమాలో అల్లరి నరేష్ నటిస్తాడా అని అనుకుంటున్నారా? లేదు నరేష్ కూడా నటించడం లేదు. వైష్ణో అకాడమీ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా త్వరలోనే అనౌన్స్ చేస్తారట. మరి ఈ సినిమాలో ముగ్గురు లీడ్ నటులు ఉంటారనే విషయం అర్థం అవుతుంది. ఆ ముగ్గురు ఎవరు? కొత్తవారితో తీస్తాడా.. లేదా యువ హీరోలను ఎంపిక చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.. మొత్తానికి క్రేజీ దర్శకుడు పూరి జగన్నాథ్ భిన్నమైన టైటిల్‌తో సినిమా చేస్తుండడం సినిమా వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది.