కామెడీతో మామ ఓ చందమామ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌కార్తీక్, సనాఖాన్ హీరో హీరోయిన్లుగా శ్రీమతి బొడ్డు లక్ష్మి సమర్పణలో ఈస్ట్‌వెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విశాఖ థ్రిల్లర్ వెంకట్ దర్శకత్వంలో వరప్రసాద్ బొడ్డు నిర్మిస్తున్న చిత్రం ‘మామ.. ఓ.. చందమామ’. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్రం యూనిట్ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో... నవంబర్ 11న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను దర్శకుడు పెద్ద వంశీ ఊరు అయిన పసలపూడిలో స్టార్ట్ చేశాం.
హీరో రామ్‌కార్తీక్, సనాఖాన్ సహా నటీనటులు వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు. అలాగే టెక్నీషియన్స్ అందించిన సపోర్ట్‌తో సినిమాను అనుకున్న సమయంలో పూర్తిచేశాం. ఈనెలాఖరు రెండో షెడ్యూల్‌ను స్టార్ట్ చేస్తాం. బి.ఎ.రాజు సహకారం కూడా మరువలేము. మున్నా కాశీ మంచి మ్యూజిక్ అందించాడు. కుటుంబ విలువలతో కూడిన కామెడీ ఎంటర్‌టైనర్‌గా సినిమా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుందని దర్శకుడు విశాఖ థ్రిల్లర్ వెంకట్ తెలియజేశారు. సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. దర్శకుడు వెంకట్ ప్రతి సీన్‌ను ఎంతో చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాటోగ్రాఫర్ బాబుగారు కోనసీమ అందాలను చక్కగా చూపిస్తున్నారు. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాం. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని హీరో రామ్ కార్తీక్ తెలిపారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు మున్నా కాశీ, కెమెరామన్ జి.ఎల్.బాబు, మాధవ్, శ్రీ్ధర్, దీపిక, కాకరల్, అనీష తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు. అజయ్‌ఘోష్, కేదారి శంకర్ నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: మరుదూరి రాజా, పాటలు: శ్రీరామ్ తమస్వి, కరుణాకర్, నిర్మాత: వరప్రసాద్ బొడ్డు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విశాఖ థ్రిల్లర్స్ వెంకట్.