నరుూం సినిమా షూటింగ్‌కు బ్రేక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, డిసెంబర్ 7: పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నరుూం నేర చరిత్ర ఆధారంగా తీస్తున్న ‘ఖయ్యూం భాయ్’ సినిమా చిత్రీకరణ నల్లగొండ పట్టణంలో అర్ధాంతరంగా ఆగిపోయింది. సినిమా యూనిట్ ఎలాంటి ముందస్తు అనుమతులు పొందకుండా రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కల్గించేలా సన్నివేశాల చిత్రీకరణ సాగిస్తుండటాన్ని నల్లగొండ పోలీసులు అడ్డుకుని షూటింగ్ నిలిపివేశారు. అయితే గత రెండు రోజుల్లో సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాల చిత్రీకరణను చిత్ర యూనిట్ పూర్తి చేసింది. దర్శకుడు భరత్ ఖయ్యూం భాయ్‌గా టైటిల్ రోల్ పోషిస్తుండగా నటులు బెనర్జీ, రాంప్రసాద్ ప్రభృతులు షూటింగ్‌లో పాల్గొన్నారు. బస్ స్టేషన్ సమీపంలోని సిపిఎం కార్యాలయం, ఆంబేద్కర్ ఆడిటోరియంల ఎదుట రోడ్లపై నరుూం(ఖయ్యూంబేగ్) గ్యాంగ్ నల్లగొండ పౌరహక్కుల నేత అజం అలీని హత్య చేసిన సన్నివేశాలను, అలాగే బేగ్ ఫంక్షన్ హాల్‌లో మాజీ మావోయిస్టు, టిఆర్‌ఎస్ నేత కొనపురి రాములును హత్య చేసే సన్నివేశాలను చిత్ర యూనిట్ చిత్రీకరించింది. సినిమా షూటింగ్‌కు సంబంధించి ఎలాంటి ముందస్తు ఏర్పాటు లేకుండా ఆకస్మాత్తుగా కత్తులు, రివాల్వర్లతో వెంటాడుతూ హత్యలు చేసే దృశ్యాలను రోడ్లపై చిత్రీకరించగా ఏం జరుగుతున్నదో తెలియక రోడ్లపై వెలుతున్న జనం భయాందోళనకు గురయ్యారు. తీరా ఇదంతా సినిమా షూటింగ్ అని తెలుసుకుని చూసేందుకు ఎగబడ్డారు.