ఎందరో మహానుభావులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లాడ సాయికృష్ణ కథానాయకుడిగా శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్, శ్రీలక్ష్మి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ఎందరో మహానుభావులు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో జరిగింది. సంగీత దర్శకుడు రఘు కుంచె ఆడియో సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- సంగీత దర్శకుడు సిద్ధార్థ్ అందించిన పాటలు చాలా బాగున్నాయని, కథానాయకుడే దర్శకుడిగా రెండు బాధ్యతలను చక్కగా నిర్వహించారని తెలిపారు. దర్శకుడు సినిమా కోసం వైవిధ్యమైన కథ, కథనాలు రాసుకున్నారని, నిర్మాతలుగా తాము డబ్బు పెట్టినా మొత్తం కష్టమంతా అతనిదేనని, ఆయనకు గతంలో లఘు చిత్రాలు చేసిన అనుభవం వుందని నిర్మాతలు అల్లాడ శ్రీనివాస్, శ్రీలక్ష్మి తెలిపారు. ఈ టైటిలే కథనం అంతా చెబుతుందని అన్నారు. ఖమ్మంకు చెందిన 200 మందిని ఈ సినిమాలో పరిచయం చేస్తున్నామని, టైటిల్‌కు భిన్నంగా పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమా సాగుతుందని, ఓ మంచి చిత్రాన్ని అందిస్తున్నామన్న ఆనందం వుందని దర్శకుడు పల్లాడ సాయికృష్ణ తెలిపారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు సిద్ధార్థ, సాయికుమార్, ఘంటశాల విశ్వనాధ్, శ్రీ, అనూష, కిరణ్, పులిపాటి ప్రసాద్ తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు.