గౌతమ్‌తో సూర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో సూర్య తన కెరీర్‌ను స్లో అండ్ స్టడీగా చేసుకుంటూ పెద్ద హీరోగా మారిన విషయం తెలిసిందే. కెరీర్ మొదటి రోజుల్లో సూర్య నటించిన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా కాకా’. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. దాన్ని తెలుగులో వెంకటేష్ హీరోగా ‘ఘర్షణ’ పేరుతో రీమేక్ చేశారు. కానీ ఇక్కడ పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత సూర్య గౌతమ్‌తో ‘వారణం ఆయురం’ అనే సినిమాతో చేయాలనుకున్నా కుదరలేదు. ‘సింగం-3’ చిత్రం పూర్తిచేసిన సూర్య మరోసారి గౌతమ్‌మీనన్‌తో సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. గౌతమ్ ఈ సినిమాకోసం కథ చర్చలు కూడా జరిపాడని తెలుస్తోంది. సూర్య కథ విన్నాక ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడట. స్టయిలిష్ మేకర్‌గా ఇమేజ్ ఉన్న గౌతమ్ వాసుదేవమీనన్, సూర్య కలయికలో రూపొందే ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.