విశాల్‌తో చాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో ‘నేను శైలజ’ చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది అందాల భామ కీర్తి సురేష్. ఆ సినిమా తరువాత తెలుగులో పలు అవకాశాలు వచ్చినా కూడా తమిళంపైనే దృష్టిపెట్టింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తున్న ఈమెకు, తాజాగా మరో క్రేజీ ఛాన్స్ దక్కింది. విశాల్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ‘సందకోజహి’ సినిమా అప్పట్లో వచ్చి సంచలన విజయం సాధించింది. దానికి సీక్వెల్‌గా ‘సందకోజహి-2’ పేరుతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని తెలుగులో ‘పందెంకోడి’ పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాతో విశాల్ తెలుగులో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సీక్వెల్‌గా రూపొందే చిత్రంలో విశాల్ సరసన కీర్తి హీరోయిన్‌గా ఓకె అయింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి రానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన రాజ్‌కిరణ్ మళ్లీ నటిస్తుండగా, మలయాళ నటుడు లాల్ పోషించిన పాత్రను సత్యరాజ్ పోషిస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమాపై కోలీవుడ్‌లో మంచి క్రేజ్ నెలకొంది. ఈ సినిమాతో కీర్తి సురేష్ లక్కీ ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు సినీ జనాలు.

చిత్రం..కీర్తి సురేష్