వీరప్పన్‌గా నటిస్తున్నా ... నటుడు రామ్‌జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటికే గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవిత కథపై చాలా చిత్రాలు వచ్చాయి. వీరప్పన్ పాత్రల్లో పలువురు నటులు నటించి ఆకట్టుకున్నారు కూడా. తాజాగా వీరప్పన్ పాత్రలో నటిస్తున్నాడు రామ్‌జగన్. తమిళంలో ‘తిరు వీరప్పన్’ పేరుతో తెరకెక్కే ఈ చిత్రంలో ప్రధాన పాత్ర చేస్తున్నానని చెప్పారాయన. ఇటీవలే ‘ఇద్దరమ్మాయిలు’ సీరియల్ ప్రచారం కోసం ఆదోని వచ్చాడు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా రామ్‌జగన్ చెప్పిన విశేషాలు..
తమిళ చిత్రంలో
వీరప్పన్ జీవిత కథతో తెరకెక్కుతున్న ‘తిరు వీరప్పన్’ చిత్రంలో తెలుగు నటుడైన నేను నటిస్తుండడం ఆనందంగా వుంది. వీరప్పన్‌ను మరో కోణంలో చూపించే చిత్రం ఇది. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా వుంది. తప్పకుండా ఈ సినిమాలోని నా పాత్రకు మంచి గుర్తింపు దక్కుతుందన్న నమ్మకం వుంది.
మర్చిపోలేని శివ
నా కెరీర్‌లో మర్చిపోలేని చిత్రం ‘శివ’. ఆ సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన నేను, ఇప్పటివరకూ ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలు చేశాను. ఈమధ్యే మహాత్మ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధుల పాత్రలు వేయడంతో ప్రేక్షకులు ఆదరించారు. నిజంగా అలాంటి పాత్రలు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రస్తుతం ‘మసక్కలీ’ చిత్రంతోపాటు మరో నాలుగైదు చిత్రాల్లో నటిస్తున్నాను. దాంతోపాటు పలు సీరియల్స్‌లో కూడా నటిస్తున్నాను. టీవీ సీరియల్స్ ద్వారా రెండు నంది అవార్డులు కూడా వచ్చాయి.
నా గురించి
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పుట్టి పెరిగాను. నెల్లూరు జిల్లా గూడూరులో మైనింగ్స్ సర్వేయర్‌గా డిగ్రీ పూర్తిచేశాను. ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకొని సినిమా రంగ ప్రవేశం చేశాను. రామానాయుడు నిర్మించిన ‘మాంగల్యబలం’ చిత్రం ద్వారా సినిమా పరిశ్రమలోకి ప్రవేశించాను. ఆ తరువాత ‘మహర్షి’, నారాయణమూర్తి తీసిన నాలుగు చిత్రాల్లో నటించాను. ముఖ్యంగా ‘మహాత్మ’లోని పాత్రకు నంది అవార్డు అందుకోవడం ఆనందంగా వుందని చెప్పారు.

- ఆంధ్రభూమి విలేఖరి, ఆదోని