ఇదిగో కాజోల్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కాజోల్ -సౌత్ ఇండియా స్క్రీన్స్‌పై ఒక్క చిత్రమే చేసింది. అది తమిళంలో రూపొందిన మిన్సార కణువు. అంటే తెలుగులో మెరుపుకలలు. 20 ఏళ్ల క్రితం ఈ చిత్రం ఓ ఊపు ఊపేసి, కాజోల్‌కు ఎక్కడలేని ఫ్యాన్స్‌ను ఆపాదించిపెట్టింది. అయితే, కాజోల్ మాత్రం సౌత్ స్క్రీన్‌కు మళ్లీ వస్తోందన్న వార్తలే తప్ప, ఇప్పటివరకూ కన్ఫర్మేషన్ లేదు. అయితే, తాజాగా అమలాపాల్ ఆనందం అసలు విషయాన్ని బయటపెట్టేసింది. వేల ఇల్ల పట్టాదారి -2 (విఐపి-2)లో కాజోల్ కనిపించబోతుందంటూ చెప్పకనే చెప్పేసింది అమలపాల్. ‘కాజోల్‌కు నేను పెద్ద ఫ్యాన్. టాలెంటెడ్ ఆర్టిస్టులు విఐపి-2లో చేరారు. ఈ కాంబినేషన్‌తో పనిచేయడానికి ఆసక్తిగా చూస్తున్నా. అదృష్టం చేసుకుంటే తప్ప దొరకని ఈ చాన్స్.. ఎప్పుడు షూటింగ్ ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తున్నా’ అంటూ కాజోల్, ధనుష్‌లతో కూడిన చిత్రాన్ని పోస్టు చేసేసింది. అసలే ధనుష్ మూవీ. అందులోనూ అమలాపాల్ హీరోయిన్. పైగా బాలీవుడ్ కాజోల్ కనిపించబోతోంది. ఇంకేంటి.. రఘువరన్ బిటెక్‌గా తెలుగులోకీ సీక్వెల్ వస్తుందని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి?