ఉత్కంఠ రేపే దండుపాళ్యం-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకట్ మూవీస్ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత వెంకట్ నిర్మించిన ‘దండుపాళ్య’ కన్నడలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీగా 30 కోట్లు కలెక్ట్ చేసి సెనే్సషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ‘దండుపాళ్యం’ పేరుతో తెలుగులో విడుదలైన ఈ చిత్రం హిట్ అయి 10 కోట్లు కలెక్ట్ చేయడమే కాకుండా శతదినోత్సవం జరుపుకొని సంచలనం సృష్టించింది. తెలుగు, కన్నడ భాషల్లో ఇంతటి ఘనవిజయం సాధించిన ‘దండుపాళ్యం’ టీమ్‌తోనే ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘దండుపాళ్యం-2’ చిత్రాన్ని నిర్మాత వెంకట్ చాలా భారీ ఎత్తున నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్యాచ్‌వర్క్ మినహా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి నిర్మాత వెంకట్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ మాట్లాడుతూ- తెలుగు, కన్నడ భాషల్లో సెనే్సషన్ క్రియేట్ చేసిన దండుపాళ్యం చిత్రానికి సీక్వెల్‌గా మా బేనర్‌లో నిర్మిస్తున్న ‘దండుపాళ్యం-2’ చిత్రానికి సినిమా ప్రారంభం నుంచే చాలా మంచి క్రేజ్ వస్తోందన్నారు.. బెంగుళూరులో కోటి రూపాయల వ్యయంతో వేసిన జైలు సెట్‌లో తీసిన కీలక సన్నివేశాలు సినిమాకి చాలా పెద్ద హైలెట్‌గా నిలుస్తాయన్నారు. ప్యాచ్‌వర్క్ మినహా షూటింగ్ పూర్తయిందని, త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని అన్నారు. డెఫినెట్‌గా దండుపాళ్యంకంటే దండుపాళ్యం-2 పెద్ద సెనే్సషన్ క్రియేట్ చేస్తుంది అన్నారు.
దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ- డిఫరెంట్ సినిమాలను అద్భుతంగా రిసీవ్ చసుకునే తెలుగు, కన్నడ ప్రేక్షకులకు దండుపాళ్యం-2 ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుందని అన్నారు. ఈ చిత్రంలో బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధి, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్ దేశ్‌పాండే, రవికాలె, పెట్రోల్ ప్రసన్న, డానీ కుట్టప్ప, జయదేవ్, కరి సుబ్బు, కోటి తదితరులు నటిస్తున్నారు.