సొంత డబ్బింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ దర్శకుడు సుకుమార్ సినిమాల్లో హీరోయన్లకు ప్రత్యేక క్రేజ్ వుంటుంది. సినిమాల్లోని వారి పాత్రలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. హీరోయిన్లు కేవలం నటన గ్లామర్‌కే పరిమితం కాకుండా వారి వారి శైలిలో ప్రతిభను ప్రదర్శించే అవకాశం వుంటుంది. తాజాగా ఇలాంటి ప్రయోగమే చేసింది అందాల భామ రకుల్ ప్రీత్‌సింగ్. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో ఈ భామ స్వంతంగా డబ్బింగ్ చెప్పిందట. తన పాత్రకి తానే తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం చాలా ఎగ్జైటింగ్‌గా వుందని, ఇంత మంచి అవకాశం ఇచ్చిన టీమ్‌కు కృతజ్ఞతలు చెప్పుకుంటోంది. అంతేకాదు, ఫస్ట్‌టైమ్ నాగొంతుతో నా పాత్రకు సరిపోయేలా మాట్లాడుతున్నాను, ఏవైనా తప్పులు దొర్లితే క్షమించండి అని ముందే చెప్పేస్తోంది గడుసుపిల్ల. ఏదేమైనా పరాయి భాష హీరోయిన్ తెలుగు నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పడం మంచి పరిణామమే.