పాటలతో మెప్పించే తుహిరే మేరీ జాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికాష్, కళ్యాణి జంటగా దుర్గాదేవి ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై ఎన్.డి.ఉదయ్ కుమార్ దర్శకత్వంలో కనవరెడ్డి నాగేశ్వరరావు నిర్మిస్తోన్న చిత్రం ‘తుహిరే మేరీ జాన్’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
దర్శకుడు ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ ‘ఇదొక ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనింగ్ మూవీ. చిన్న సినిమా అయినా అందరూ ఇష్టపడి చేసిన సినిమా. ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకొంది. త్వరలోనే ఆడియో విడుదల చేసి సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు. హీరో వికాష్ మాట్లాడుతూ- ‘తెలుగులో ఇది నా మొదటి సినిమా. అందరూ కొత్తవాళ్లతో కలిసి చేశాం. మంచి పాటలు కుదిరాయి. సినిమాను కొత్తగా తీయడానికి ప్రయత్నించాం. ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం’ అని చెప్పారు.