ఒక్కడొచ్చాడు ఓ కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘విశాల్ కథానాయకుడిగా నేను నటించిన ‘ఒక్కడొచ్చాడు’ సినిమా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ సినిమాలో పాటలలో నన్ను ప్రత్యేకంగా చూపించారు. లిరిక్ కూడా అంతే ప్రత్యేకంగా రాయించారు. ఈ సినిమా ఓ రకంగా నా అభిమానులకు బర్త్‌డే గిఫ్ట్‌లాంటిది’ అని నటి తమన్నా తెలిపారు. హరివెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై నిర్మాత జి.హరి తెలుగులో అందిస్తున్న చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. విశాల్ సరసన తమన్నా తొలిసారిగా నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 23న విడుదలకు సిద్ధమైంది. నేడు తమన్నా జన్మదినోత్సవం సందర్భంగా చిత్ర విశేషాలను తెలిపారు.
నటనకు అవకాశం
జగపతిబాబు చెల్లెలుగా ఈ సినిమాలో నటించాను. నటనకు పూర్తి అవకాశం వున్న ప్రాధాన్యమైన పాత్ర నాది. కమర్షియల్ యాక్షన్ పాక్డ్ మూవీ అయినాగానీ అన్ని హంగులూ ఉన్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు ప్రేక్షకులకు ఓ సందేశం కూడా వుంటుంది. ఈ చిత్రం నా బర్త్‌డే టైమ్‌లో విడుదల కావడం మరింత ఆనందాన్నిస్తోంది.
అన్ని విషయాల్లో కేర్
నిర్మాత హరి ఈ సినిమా ప్రారంభం నుండి మాతోనే ట్రావెల్ అవుతున్నారు. ఓవైపు తమిళం, మరోవైపు తెలుగు సినిమా షూటింగ్‌లో ఆయన తీసుకున్న జాగ్రత్తలు ఈ సినిమాకు ఎంతో ఉపకరించాయి. తెలుగులో నేటివిటీ ఉన్నట్లుగానే తీర్చిదిద్దటంలో ఆయన తీసుకున్న జాగ్రత్తలు సినిమా చూస్తే అర్థమవుతాయి. పాటల చిత్రీకరణ, ట్రైలర్ల విడుదల సమయంలోనే కాక సినిమా ప్రమోషన్ విషయంలో కూడా ఆయన శ్రద్ధ తీసుకున్నారు.
సినిమాకోసమే
హీరో విశాల్‌తో తొలిసారిగా ఈ సినిమాలో కలిసి నటించాను. విశాల్ ఎప్పుడు ఏ సినిమా చేసినా ఆ సినిమా బాగుండాలని కష్టపడతాడు. సెట్స్‌లో అతని డెడికేషన్ ఆకట్టుకుంటుంది. నటుడిగానే కాక నడిగర్ సంఘంలో ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా అందరికీ నచ్చాయి. ఓ మంచి హీరోతో నటించిన అనుభూతి కలిగింది.
పాటలు హైలెట్
ఒక కమర్షియల్ సినిమాకు ప్రేక్షకుడు రావాలంటే మాటలే కాక పాటలు కూడా కీలక పాత్ర వహిస్తాయి. డైలాగ్ రైటర్ ప్రతి డైలాగును ప్రేక్షకుడికి నచ్చేలా ఈ సినిమాలో రాశారు. అలాగే పాటలను కూడా చల్లా భాగ్యలక్ష్మి చక్కగా రాశారు. ‘నేకొంచెం నలుపులే, నువ్వేమో తెలుపులే’ అనే పాట నాకు చాలా నచ్చింది. పాటల్లో నా పేరును కూడా వినిపించారు. యూత్ అంతా ప్రస్తుతం ఈ పాటలే పాడుకుంటున్నారు.
ప్రత్యేకతలు
సినిమా మొత్తం నైస్ లవ్‌ట్రాక్‌తో నడుస్తుంది. మంచి పాటలు ఉన్నాయి. ఓ కామెడీ ట్రాక్ తెగ నవ్వించేస్తుంది. మంచి స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా సాగుతూ ప్రతి సన్నివేశం హైలెట్‌గానే వుంటుంది. దర్శకుడు సురాజ్ కూడా కామెడీ పాయింట్‌తో కమర్షియల్ యాంగిల్‌ను మేళవించి సినిమాలు తీయడంలో దిట్ట కనుక కుటుంబం అంతా కలిసి చూడదగిన విధంగా రూపొందించారు.
తదుపరి ప్రాజెక్టులు
ప్రస్తుతం ‘బాహుబలి-2’లో నటిస్తున్నాను. అది వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లో విడుదల కానుంది. రాజవౌళి దర్శకత్వంలో విజువల్ వండర్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రెండో భాగంలో కూడా నటించడం అదృష్టంగా భావిస్తున్నా. అలాగే ఓ తమిళ సినిమాలో కూడా ప్రస్తుతం నటిస్తున్నాను.

-యు