పవన్‌కల్యాణ్‌తో ఉపేంద్ర?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘కాటమరాయుడు’ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరిలో సెట్స్‌పైకి రానుంది. ఇక జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తరువాత పవన్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి? ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా... ఉపేంద్ర. హీరోగా భిన్నమైన చిత్రాలతో ఆకట్టుకున్న ఉపేంద్ర అంటే తెలుగు ప్రేక్షకుల్లో అదో క్రేజ్. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో ఉపేంద్రను చాలా కాలం తరువాత తెలుగులో నటింపజేశాడు. మళ్లీ ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడట. పవన్ సినిమాలో ఉపేంద్ర నటించడంతో ఆయన పాత్ర ఎలా ఉంటుంది అన్న ఆసక్తి ఇప్పటికే అందరిలో నెలకొంది. అన్నట్టు ఈ చిత్రానికి ‘దేవుడే దిగివచ్చిన’ అనే టైటిల్ పెడుతున్నట్టు సమాచారం.